Srileela : శ్రీలీల డాన్స్ కు ఎన్టీఆర్ స్పూర్తినట!

Update: 2025-08-25 13:15 GMT

టాలీవుడ్లోని టాప్ బెస్ట్ డ్యాన్సర్లలో శ్రీలీల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో బిజీ ఆర్టిస్ట్. అయితే ఆమెను డ్యాన్స్ శిక్షణలో చేర్చించడానికి నటి తల్లికి జూనియర్ ఎన్టీఆర్ స్పూర్తి నింపారట. జగపతిబాబు హోస్ట్ గా వ్య వహరిస్తోన్న జయమ్ము నిశ్చయమ్మురా షోలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత ఈ విషయం వెల్లడించింది. 1997లో లాస్ ఏంజెల్స్ తానా సభల్లో ఒకసారి ఎన్టీఆర్ని కలిసి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకుంది. హీరోయిన్ గా దూసుకెళుతున్నావ్.. చాలా మంది అవకాశాల్ని లాగేసుకుంటున్నావు కదా! అని షో హోస్ట్ జగపతిబాబు శ్రీలీ లను ఆటపట్టించాడు. ఆ షోలో శ్రీలీల, ఆమె తల్లి స్వర్ణలత ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. షోలో ఎన్టీఆ ర్ కూచిపూడి నేర్చుకుంటున్నప్పటి ఒక అందమైన స్టిల్ షేర్ చేయగా.. ఆ ఫొటో వెనుక స్టోరీని ఆమె వివరించింది. తనకు అమ్మాయి పుడితే డ్యాన్స్ నేర్పించాలని స్పూర్తి నింపిన క్షణానికి సంబంధించిన ఫొటో అది అని గుర్తు చేసుకుంది. తాను అనుకున్నట్లే శ్రీలీలకు డ్యాన్స్లు నేర్పించానని చెప్పింది. జీ5 ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

Tags:    

Similar News