పలాస 1978, మసూద, పరేషాన్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. ఈమూవీస్ గుర్తొస్తాయి తిరువీర్ కనిపిస్తాడు. ప్రతి సినిమాతోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. కాకపోతే అతనికంటూ ఇమేజ్ క్రియేట్ కాలేదు. బట్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీతో మాత్రం అతనికి కోరుకున్న గుర్తింపు వచ్చింది. హీరోగా రాణించే అవకాశం ఉందనిపించుకున్నాడు. మసూదకు సీక్వెల్ కోసం చూస్తున్నారు చాలామంది. ఇక ఈ టైమ్ లో అతని కెరీర్ లో మలుపు తిప్పే సినిమా వచ్చే అవకాశం ఉందనిపించేలా ఉంది..‘ఓ సుకుమారీ’. అతని కొత్త సినిమా టైటిల్ ఇదే.
ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటిస్తోంది ఈ చిత్రంలో. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఉంది ఐశ్వర్య రాజేష్. అలాంటి తనతో తిరువీర్ మూవీ అంటే అతనికీ ప్లస్ అవుతుంది. అదే టైమ్ లో ఇద్దరి మధ్య పోటీ కూడా కనిపిస్తోంది. ఓ రకంగా తిరువీర్ రేంజ్ కూడా మారబోతోంది అనిపించేలా ఉంది ఈ మూవీతో.
ఇక ఈ మూవీ టైటిల్ తో పాటు కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. విశేషం ఏంటంటే.. ఇదో ప్యాన్ ఇండియన్ మూవీగా రూపొందించబోతున్నారు. పోస్టర్ తో ఆకట్టుకునేలా ఉన్నారు. మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకుడు. మరి ఈ ప్యాన్ ఇండియన్ మూవీతో తిరువీర్ రేంజ్ పెరుగుతుందా లేదా అనేది చూడాలి.