ఏ ఇండస్ట్రీలో అయినా ‘ఇదుగో కాంబినేషన్ అంటే అదుగో ఆర్టిస్టులు’అనే వార్తలు రావడం చాలా సహజం. ఇక రాజమౌళి లాంటి ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ మూవీ అంటే ఏ భాషలో అయినా క్రేజీ రూమర్ అవుతుంది. అందుకే ఈయన సినిమాకు సంబంధించి రోజుకో వార్త షికారు చేస్తుంటుంది. అయితే కొన్నాళ్లుగా ఈ రూమర్స్ ఆగిపోయాయి అనుకుంటున్న టైమ్ లో సడెన్ గా మరోటి స్టార్ట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి మూవీ అనౌన్స్ అయిన తర్వాత రికార్డులు బద్ధలైపోవడం ఖాయం అనే చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకూ మహేష్ బాబు రేంజ్ టాలీవుడ్ ను దాటలేదు. బట్ రాజమౌళితో ఒకేసారి గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం కాబోతున్నాడు.
ఎప్పట్లానే రాజమౌళి మూవీ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఆలస్యం అవుతోంది. ఈ క్రేజీ కాంబో గురించి తప్ప మిగతా అప్డేట్స్ ఏం రావడం లేదు. స్టోరీ పరంగా చూస్తే అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని మాత్రం చెప్పారు. మరి హీరోయిన్ ఎవరు.. విలన్ ఎవరు.. ఇతర పాత్రల్లో ఎవరు కనిపించబోతున్నారు లాంటి అప్డేట్స్ ఏం లేవు. దీంతో రోజుకో హీరోయిన్ పేరు తెరపైకి వస్తోంది.
అయితే ఇప్పటి వరకూ మహేష్ కు జోడీగా అంటూ ఎక్కువగా హాలీవుడ్ హీరోయిన్ల పేర్లే వినిపించాయి. ఫస్ట్ టైమ్ బాలీవుడ్ బ్యూటీ పేరు వినిపిస్తోంది. తనే ప్రియాంక చోప్రా. ఆల్రెడీ పెళ్లైపోయినా.. ఇప్పటికీ హాలీవుడ్ మూవీస్ లో అదరగొట్టే ప్రయత్నం చేస్తోంది ప్రియాంక చోప్రా. తను వరల్డ్ వైడ్ గా కాస్త ఎక్కువమందికే తెలుసు. పైగా హాట్ సీన్స్ కు సైతం యస్ అనేస్తోంది. అందుకే ఆమె చాలామందికి తెలుసు. సో.. ఇప్పుడు మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేశారు అనేది లేటెస్ట్ రూమర్.
రాజమౌళి స్వయంగా అనౌన్స్ చేసే వరకూ మహేష్ కు జోడీలను వెదుకుతూనే ఉంటారు. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారా లేక ఎప్పట్లానే సస్పెన్స్ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.