Prabhas : ప్రభాస్ సరసన పాకిస్థానీ బ్యూటీ!

Update: 2024-07-23 12:45 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో హను రాఘవపుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రేమకథల స్పెషలిస్ట్

డైరెక్టర్ గా హను రాఘవపూడికి పేరుంది. ప్రభాస్ తోనూ ప్రేమ కథను తెర కెక్కిస్తారా? మరోదైనా కొత్త నేపథ్యంలో ఆడియన్స్ ను అలరిస్తారా? అన్న ఆసక్తి ఉంది. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది.

ప్రభాస్ కు జోడీగా ఈ మూవీలో హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఐదు సినిమాల్లో ఇప్పటి వరకు నలుగురు కొత్త హీరోయిన్స్ ను తీసుకున్నారు. అందాల రాక్షసి మూవీతో లావణ్య త్రిపాఠిని పరిచయం చేశారు. కృష్ణగాడి వీరప్రేమగా థతో మెహ్రీన్ పిర్జాదా... లై మూవీతో మేఘా ఆకాశ్... సీతారామం మూవీలో మృణాల్ ఠాకూర్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు. తాజాగా ప్రభాస్ సినిమా కోసం కొత్త హీరోయిన్ ను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ సారి ఏకంగా పొరుగుదేశం భామను టాలీవుడు పరిచయం చేయబోతున్నట్లు టాక్. ఆమె ఎవరో కాదు పాక్ బ్యూటీ సజల్ అలీని ప్రభాస్ కు జోడీగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ లో పలు సినిమాల్లో నటించిన సజల్ అలీ.. గతంలో బాలీవుడ్లో శ్రీదేవి 'మామ్' మూవీలో నటిస్తోంది. తాజాగా ప్రభాస్ మూవీతో మరోసారి భారతీయ అభిమానులను పలుకరించనుందని టాక్. ఈ మూవీని ఆగస్టులో పూజ కార్యక్రమంతో ప్రారంభించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News