Paruchuri Gopala Krishna: ఆ సినిమాలో రామ్‌చరణ్ అనవసరంగా చేశాడు: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna: కొరటాల శివ డైరెక్షన్.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా విడుదలైన ఆచార్య చిత్రంపై ఆడియన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Update: 2022-07-02 08:56 GMT

Paruchuri Gopala Krishna: కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా విడుదలైన ఆచార్య చిత్రంపై ఆడియన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ విడుదలైన మొదటి రోజే సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకుంది.. పేరున్న డైరెక్టర్, పెద్ద హీరోలు నటించినా కథ నచ్చకపోతే సమస్యే లేదు.. సర్ధుకోవలసిందే..

తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇదే విషయాన్ని వివరిస్తూ ఆచార్య ఆకట్టుకోపోవడానికి గల కారణాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

1980వ దశకంలో ఎన్నో విప్లవాత్మక సినిమాలు వచ్చాయి. ఆ టైమ్‌కి అవి ప్రేక్షకుడికి నచ్చాయి. ఒక దశకు వచ్చాక ప్రేక్షకులు వాటిని తిప్పికొట్టారు.. దర్శకులు కూడా అటువంటి కథలవైపు చూడ్డం మానేశారు. ఇలాంటి సమయంలో కొరటాల ఈ సినిమా తీయడం ఎంత వరకు కరెక్ట్..

సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే చోట ఇమడవు.. కథలో ముఖ్యమైన సంఘటన ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని చెప్పకుండా కథను నడిపించిన తీరు ప్రేక్షకుడిని అయోమయంలో పడేసింది. ఇక సిద్ధ పాత్ర కూడా ఫస్టాఫ్‌లోనే వచ్చుంటే బాగుండేది. ఆ పాత్ర గురించి మొత్తం కాకపోయినా కొంతైనా చూపించి ఉంటే సినిమా ఇంకోలా ఉండేది. ఇప్పటికాలమానం ప్రకారం ప్రేక్షకులు కమ్యూనిజం భావజాలం ఉన్న సినిమాలను అంగీకరించట్లేదు.

అసలు రామ్ చరణ్ సిద్ధ పాత్ర వేయకుండా ఉంటే బావుండేది. ఫ్లాష్ బ్యాక్ కేవలం 10 శాతం ఉంచి, చిరు స్టోరీ 90 శాతం ఉండుంటే సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేది. స్టోరీనే ఇలా ఉందనుకుంటే, సంగీతం కూడా ఆకట్టుకోకపోవడం బాధాకరం.. అది కూడా సినిమాకు సూటవలేదున్నారు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పాత్రలో చిరు స్టెప్పులు వేయకుండా ఉండే బాగుండేది. ఇక చివరిగా అసలు ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ కూడా కరెక్ట్ కాదు అని తేల్చేశారు పరుచూరి. 

Tags:    

Similar News