Pawan Kalyan : పవర్ స్టార్ జనసేనాని చేతుల మీదుగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్స్ లాంచ్..

Pawan Kalyan : తెలుగు ఫిల్మ జర్నలిస్ట్ అసోసియేషన్ సోషల్ మీడియా అకౌంట్లను లాంచ్ చేసిన పవన్ కళ్యాణ్

Update: 2022-09-10 12:07 GMT

Pawan Kalyan : తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు సంబంధించిన వైబ్సైట్, ఇతర సోషల మీడియా అకౌంట్లను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేశారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ వై.జై రాంబాబు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'నా చేతుల మీదగా ప్రారంభించడం చాలా ఆనందం గా ఉంది, 175 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్ లో నాకు బాగా నచ్చిన అంశం, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకి 3 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం, జీవిత భీమా కింద 15 లక్షలు, ఆక్సిడెంట్ పాలసీ కింద 25 లక్షలు ఇవ్వడం వారి కుటుంభం సభ్యులకి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 175 మంది జర్నలిస్టుల పై ఆధారపడ్డ వారిని కలిపి దాదాపు 700 మందికి అవసరమొచ్చినప్పుడు ఆసరా లభిస్తుంది. అలాగే వీరు ఆదర్శవంతమైన జర్నలిజం, సమాజంలోని తప్పొప్పులని సరి చేసేలాగా, అవసరం లేని వివాదాల జోలికి వెళ్లకుండా, అలా ఏమైనా జరిగినా గాడిన పెట్టే అసోసియేషన్ అవుతుంది అని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను'. అని అన్నారు. 





 



 




Tags:    

Similar News