హరి హర వీర మల్లు.. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పవన్ ( Pawan Kalyan ) ఫస్ట్ టైమ్ ఓ హిస్టారికల్ ఎపిక్ వారియర్ సినిమాలో నటిస్తున్నాడు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఓ యోధుడి కథగా ఇది రూపొందుతోం ది. ఇటీవల రిలీజైన టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రెండు పార్టులుగా వస్తున్న వీరమల్లు ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇకపోతే గతకొంత కాలంగా ఎపీ ఎన్నికల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. చాలా రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం లేదు. ఇప్పుడుఎన్నికలు అయిపోవడం, ఆయన భారీ వి జయాన్ని సాధించడం, డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అంతా జరిగిపోయింది. దీంతో పవన్ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యారు.
దీంతో ఇక షూటింగ్ లో పాల్గొంనేందుకు ఆయన సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉస్తాద్ సింగ్ కూడా ఉండగా.. వీరమల్లు షూటింగ్ 50 శాతం పూర్తి కావడంతో ముందుగా దాన్ని పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నారట. ఈ నెల చివర్లో లేదంటే వచ్చే నెల ప్రారంభంలో వీరమ లు షూటింగ్ లో పవన్ పాల్గొంటారని సమాచారం.