Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫేస్‌బుక్ పేజ్‌ను గమనించారా? ఆయన రాసిన కొటేషన్ చదివారా?

Pawan Kalyan: తన ఆలోచనలను అప్పుడప్పుడు ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌తో పంచుకుంటారు పవన్.

Update: 2022-03-02 14:37 GMT

Pawan Kalyan (tv5news.in)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పటిలాగా కేవలం సినిమాలకు మాత్రమే కాదు. రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. జనసేన పార్టీ కోసం, రాజకీయ విలువల కోసం పవన్ ఎప్పుడూ ఆదర్శంగా ఉంటారు. అయితే ఇటీవల పవన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పవన్ కళ్యాణ్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కాదు. ఫేస్‌బుక్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అందులో ఎక్కువగా జనసేన కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు పెడుతూ ఉంటారు. అయితే తన ఆలోచనలను అప్పుడప్పుడు ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌తో పంచుకుంటారు పవన్. అలాగే తాజాగా తను ఓ కొటేషన్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

కొటేషన్ పెట్టడమే కాదు.. పవన్ దానికి ఒక కార్టూన్‌ను కూడా జతచేశారు. అందుకే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. జనసేనాని ఫాలోవర్స్ అందరూ దీనిని తెగ షేర్ చేసేస్తు్న్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించే చర్చ నడుస్తోంది. ఈ సమయంలో యుద్ధం గురించే పవన్ పోస్ట్ పెట్టడం హాట్ టాపి‌క్‌గా మారింది.

Full View

ఇప్పటికీ ఇంకా భీమ్లా నాయక్ జోష్‌లో ఉన్న పవన్ అభిమానులకు ఈ పోస్ట్ మరింత ఎనర్జీని ఇచ్చింది. అయితే ఇది రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పెట్టిన పోస్టా? లేక ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులకు సంబంధించి చేసిన పోస్టా? అన్నది స్పష్టంగా చెప్పకపోయినా.. పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది.

Tags:    

Similar News