Ustaad Bhagat Singh Update : పవన్ కల్యాణ్ ఉస్తాద్ అప్ డేట్ అదిరింది

Update: 2024-08-31 16:45 GMT

పవర్ స్టార్ పవన్ కల్యాణ్​, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఏడాది కిందట వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. అయితే, ఆ తర్వాత ఏపీ ఎన్నికలు జరగడం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ‘ఉస్తాద్’ షూటింగ్ కు బ్రేక్ లు పడ్డాయి. తాజాగా ఆ మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరైన రవిశంకర్ ‘ఉస్తాద్’పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ‘ఇటీవల పవన్‌ను మీట్ అయ్యా. తొందరలోనే ఉస్తాద్‌ భగత్‌సింగ్‌షూటింగ్‌ను ప్రారంభించనున్నాం. డిసెంబర్‌, జనవరిలోగా షూటింగ్ ను కంప్లీట్ చేస్తాం. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా ఓ సర్ ప్రైజ్ కన్ఫామ్ గా ఉంటుంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. రవిశంకర్ ఇచ్చిన అప్ డేట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ‘ఉస్తాద్’ సర్ ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News