ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పై ముంబైలో పోలీస్ కేస్ నమోదైంది. అందుకు కారణం అతని అభిమానులే కావడం విశేషం. ఇదంతా కేవలం అతను తన ఫ్యాన్స్ సంబోధించిన విధానం వల్లే జరిగింది. యస్.. ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే అల్లు అర్జున్ కు కూడా ఉన్నారు. అయితే అతను చాలా సందర్బాల్లో ఈ విషయాన్ని డిఫరెంట్ గా చెప్పాలనే ప్రయత్నం చేస్తూ.. ‘అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. నాకు ఆర్మీ ఉంది’ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇదే మాటను రీసెంట్ గా ముంబైలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లినప్పుడు కూడా అన్నాడు. అదే ఇప్పుడు పోలీస్ కేస్ కు కారణమైంది.
గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నిర్వాహకుడైన శ్రీనివాస్ అనే వ్యక్తి అల్లు అర్జున్ పై కేస్ పెట్టాడు. ఈ విషయంపై అతను స్పందిస్తూ.. ‘ఇకపై తన ఫ్యాన్స్ ను ఆర్మీ అని పిలవొద్దని టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్మీ అనేది ఓ గౌరవప్రదమైన పోస్ట్. వాళ్లు దేశం కోసం ప్రాణాలర్పించే వాళ్లు. అలాంటి పేరును అభిమానులకు వాడొద్దు. కావాలంటే ఇంకేదైనా పేరు వాడుకో’అని అన్నాడు.
సో.. ఇది చూసి ఇతర ప్రాంతాల్లో కూడా కేస్ లు నమోదైతే.. ఇంక అల్లు అర్జున్ ఆర్మీ అనే మాటకు కాలం చెల్లినట్టే. నిజానికి తెలుగులో కూడా ఈ మాటపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ అదంతా ఓర్వలేక చేస్తున్నారు అంటూ ఆ ఫ్యాన్స తిప్పి కొట్టారు. బట్ ఇప్పుడు ముంబై నుంచి వచ్చిన రియాక్షన్ కు వీరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.