Polimera 3 : పొలిమేర 3 వచ్చేస్తోంది

Update: 2024-07-10 09:45 GMT

దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన పొలిమేర సినిమా ఎంత పెద్ద విజయాన్నీ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా టైంలో డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. చేతబడులు నేపధ్యంలో వచింది ఈ సినిమాలో సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శ్రీను, సాహితి దాసరి, కామాక్షి భాస్కర్ల తదితరులు కీ రోల్స్ చేశారు. 2021లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో భయపెట్టింది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా పొలిమేర 2 కూడా వచ్చిన విషయం తెలిసిందే. 2023లో థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబటిందో ఈ మూవీ. ఇక సినిమా చివర్లో పార్ట్ 3 కూడా ఉండనుందని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక అప్పటినుండి పొలిమేర పార్ట్ 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

ఇందులో భాగంగానే తాజాగా పొలిమేర 3పై అధికారిక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు. పార్ట్ 1, పార్ట్ 2 సీన్స్ తో వచ్చిన ఈ వీడియోలో పృద్వి లెట్స్ బిగిన్ ది షో అనడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పటినుండే పార్టీ 3పై అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లో గానీ ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

 

Tags:    

Similar News