Pooja Hegde : మహేష్‌కి హ్యాండ్ ఇచ్చిన బుట్టబొమ్మ.. స్టార్ హీరోయిన్ రీప్లేస్..!
Pooja Hegde : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.;
Pooja Hegde : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబో నుంచి వస్తోన్న సినిమా కావడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హేగ్దే నటిస్తోంది. ఇప్పటికే ఆఫీషియల్‌గా ఆమె పేరును కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి పూజా తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తను రాధేశ్యామ్, 'ఆచార్య', 'బీస్ట్', 'సర్కస్' చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది పూజా.. ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. దీనితో మహేశ్-త్రివిక్రమ్‌ల సినిమాకు డేట్స్ సర్దుబాటు కావడంలేదట. దీంతో ఈ మూవీ నుంచి పూజ తప్పుకున్నట్లుగా సమాచారం.
ఈ క్రమంలో మేకర్స్ ఆమె స్థానంలో స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన కూడా వెలువడనుందట. కాగా సామ్, మహేష్ లది మంచి హిట్ కాంబినేషన్, అటు సామ్, త్రివిక్రమ్ లది కూడా హిట్ కాంబినేషన్ కావడంతో సెంటిమెంట్ వర్కౌట్ అవుతోందని ఆమెను సంప్రదించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.