పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే సినిమాల్లో సందడి తగ్గిపోయింది. దీంతో.. డోసు పెంచేందుకు సిద్ధమైంది. ఆ మధ్య టాలీవుడ్ కైతే మంచి కిక్కిచ్చిన ఈ స్లిమ్ బ్యూటీ.. మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతోంది.
పూజా హెగ్డేక వరుస ఫ్లాపులు రావడంతో తెలుగు మేకర్లు అంతగా పట్టించుకోవడం లేదు. తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మకు అంతగా ఆఫర్లు రావడం లేదనిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఆఫర్లు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌తో చేసిన మూవీ డిజాస్టర్ అయింది. విజయ్ బీస్ట్ కూడా హిట్ అందుకోకపోవడంతో పూర్తిగా ఆఫర్లు తగ్గిపోయాయి.
తెలుగులో బుట్టబొమ్మ పేరు విని చాలా కాలం అవుతుంది. తాజాగా, స్టార్ హీరో మూవీలో పూజా హెగ్డే బంపర్ ఆఫర్ కొట్టేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగచైతన్య హీరోగా విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఫిక్స్ ఒకే చేసినట్టు సమాచారం. నాగచైతన్య, పూజా హెగ్డే గతంలోనూ ఓ మూవీలో కలిసి నటించారు.