టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ( Pooja Hegde ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ భామ నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు ఇలా స్టార్ హీరోలందరితో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.
అయితే గత కొంతకాలంగా తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేని ఈ ముద్దుగుమ్మ తనకు తెలుగు సినిమా ఎంతో ప్రత్యేకం అని అంటోంది. ప్రస్తుతం ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటున్న పూజా హెగ్డే తాజాగా అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో తెలుగు సినిమాపై తన ప్రేమని బయటపెట్టింది. ఓ అభిమాని అని భాషల్లో నటిస్తున్నారు కదా నటిగా మీ ప్రయారిటీ ఏ భాషకిస్తారు? అనడిగితే.. నటనకు ప్రాంతీయబేధం లేదు. ఏ భాషలోనైనా నాకు కంఫర్ట్ గానే ఉంటుంది. అయితే తెలుగు సినిమా నాకు ప్రత్యేకం. ఎందుకంటే.. నాకంటూ ఒక ఐడెంటిటీని ఇచ్చింది మాత్రం తెలుగు సినిమానే. అందుకే తెలుగు సినిమా నాకు చాలా స్పెషల్. నేను ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో అవకాశం వస్తే మాత్రం కాస్త ఎక్కువ ఆనందిస్తా అని తెలిపింది.
త్వరలో తెలుగులో ఓ మంచి సినిమా చేస్తా అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.