Poojitha Ponnada : దేవిశ్రీ ప్రసాద్ పూజిత పొన్నాాడ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా..?
Poojitha Ponnada : డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ పూజిత పొన్నాడా వివాహం త్వరలో జరగబోతున్నట్లు సినీటౌన్‌లో వార్తలు వైరల్ అయ్యాయి;
Poojitha Ponnada : డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ పూజిత పొన్నాడా వివాహం త్వరలో జరగబోతున్నట్లు సినీటౌన్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించి నటి పూజిత పొన్నాడా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం ఆకాశ వీధుల్లో మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాంకర్ పూజిత్ పొన్నాడాను దేవిశ్రీతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించారు. నటి మాట్లాడుతూ... 'ఇదంతా రూమర్స్ మాత్రమే నేను దేవిశ్రీ ప్రసాద్‌తో మాత్రమే కాదు ఇంకెవరితోనూ రిలేషన్‌లో లేను' అని పూజిత పొన్నాడ స్పష్టం చేసింది.
ఊపిరి సినిమాలో చిన్న పాత్ర పోషించి ఆమె సినీఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత రంగస్థలం, బ్రాండ్ బాబు, మిస్ ఇండియా లాంటి చిత్రాల్లో నటించా పెద్దగా గుర్తింపు సాధించుకోలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ప్రతీ రోజు యాక్టివ్‌గా ఉంటుంది. సరికొత్త ఫోటోషూట్స్‌తో ఫాలోవర్స్‌ను అలరిస్తోంది.