పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యువ రచయితలకు, డైరెక్టర్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ప్రభాస్ తన అన్న ప్రమోద్ తో కలిసి "ది స్క్రిప్ట్ క్రాఫ్ట్" అనే సంస్థని స్థాపించాడు. తాజాగా దీనికి సంబందించిన ఓ పోస్ట్ షేర్ చేసాడు ప్రభాస్. "మీ దగ్గర మంచి కథలు ఉన్నా అవకాశం రావట్లేదా. మీ లాంటి వాళ్ళ కోసమే ఒక వెబ్ సైట్ తీసుకొస్తున్నాము. ఆ వెబ్ సైట్ లో మీ కథను లేదా సినాప్సిస్ ని అప్లోడ్ చేస్తే ఆడియన్స్ వాటికి రియాక్ట్ అవుతారు. ఎక్కువ రియాక్షన్స్ వచ్చిన మంచి కథలను సినిమా రూపంలోకి తీసుకొస్తామని" తెలిపాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వెబ్ సైట్ ద్వారా చాలా మంది కొత్త వారికి అవకాశాలు రానున్నాయి. మారేందుకు ఆలస్యం మీలో కూడా రచయిత ఉన్నాడా? అయితే వెంటనే ప్రభాస్ చెప్పిన వెబ్ సైట్ మీ కథను పంపండి. ఆ అవకాశాన్ని దక్కించుకొంది.