Prabhas Next Project : ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టు ఇదే! వెయ్యి కోట్లు పక్కా!!

Update: 2024-07-04 07:22 GMT

కల్కి.. కల్కి.. కల్కి.. ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. రికార్డులు సృష్టించిన ఈ సినిమా వసూళ్ల వర్షంతో దూసుకుపోతోంది. రూ.1000 కోట్ల పైన వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కల్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో రెట్టింపు ఉత్సాహంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాకు సిద్ధమవుతున్నాడు.

తాజాగా ప్రభాస్ ( Prabhas ) సలార్ సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వం షూటింగ్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సలాడ్ ది సీజ్ ఫైర్ కు సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. నెక్స్ట్ పార్ట్ లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సుల్లో నటిస్తుండటంతో.. సలార్ 2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఇప్పటికీ సినిమాను సగం షూటింగ్ పూర్తైనట్లు ప్రశాంత్ నీల్ గతంలోనే వివరించాడు. కల్కిలో ప్రభాస్ కామెడీ టైమింగ్ సూపర్ గా వర్కవుట్ అయింది. మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న రాజాసాబ్ కూడా కామెడీ మూవీ కావడంతో.. అది కూడా చకచకా పూర్తవుతుందని తెలుస్తోంది. సలార్ రావడానికి ముందే రాజాసాబ్ వస్తుందని చెబుతున్నారు. ప్రభాస్ సీన్లను చకచకా తీస్తూ.. మారుతి కూడా మల్టీ టాస్క్ చేస్తున్నట్టు సమాచారం. ఆగస్టు రెండోవారం నుంచి సలార్- శౌర్యాంగ పర్వం మిగిలిన షూట్ మొదలుకానుంది.

Tags:    

Similar News