Prakash Raj: అప్పూ సేవా కార్యక్రమాలు నేను కొనసాగిస్తా: ప్రకాష్ రాజ్

Prakash Raj: పునీత్ ప్రారంభించిన సేవలను ఇకపై తాను ముందుకు తీసుకెళ్లబోతున్నానని.. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానని అప్పూ ఫోటోను షేర్ చేశారు.

Update: 2022-03-26 12:30 GMT

Prakash Raj: పునీత్ రాజ్ కుమార్ (అప్పూ) చేసిన పుణ్యాకార్యక్రమాల్లో తాను పాలు పంచుకుంటానంటున్నారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను తాను కొనసాగిస్తానంటున్నారు.

పునీత్ గతంలో చేసిన సేవలను ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రకాష్ తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ ప్రత్యేకమైన రోజున ఈ శుభవార్తను మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పునీత్ ప్రారంభించిన సేవలను ఇకపై తాను ముందుకు తీసుకెళ్లబోతున్నానని.. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానని అప్పూ ఫోటోను షేర్ చేశారు.

మంచి మనుషులను దేవుడు త్వరగా తీసుకెళ్లిపోతాడంటారు. తండ్రి నటనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పునీత్.. స్టార్ హీరోగా ఎదిగారు.. అంతకంటే ఎక్కువగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు తన సేవా కార్యక్రమాల ద్వారా.. ఆయన ఆధ్వర్యంలో 45 ఫ్రీ స్కూల్స్, 25 అనాధాశ్రమాలు, 19 గోశాలలు, 16 వృద్ధాశ్రమాలు ఉన్నాయి.

ఇవి కాకుండా 1800 మంది విద్యార్ధుల చదువు బాధ్యతలను ఆయన తీసుకున్నారు. పునీత్ మరణానంతరం ఈ 1800 మందిని చదివించే బాధ్యత తనది అని హీరో విశాల్ చెప్పారు. మిగిలిన సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు ప్రకాష్ రాజ్ ప్రకటించడంతో నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ ఇప్పటికే నెలకొల్పిన తన ఫౌండేషన్ ద్వారా అనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తెలంగాణలో పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. లాక్ డౌన్ ఎంతో మంది పేదలకు అండగా నిలిచి ఆదుకున్నారు



Tags:    

Similar News