Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ లీక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..
Bigg Boss Telugu 5: శ్రీరామ్, కాజల్, సిరి, ప్రియాంక, మానస్‌లలో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లబోతున్నారనే దానిపై గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.;
Bigg Boss Telugu 5: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఈసారి ఎవరు విన్నర్ అవుతారో అనే ఆసక్తి నెలకొంది అందరిలో. ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లతో మొదలై చివరికి ఏడుగురు మిగిలారు. వారిలో షణ్ముఖ్, సన్నీ తప్ప మిగిలిన వారంతా నామినేషన్‌లో ఉన్నారు. శ్రీరామ్, కాజల్, సిరి, ప్రియాంక, మానస్‌లలో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లబోతున్నారనే దానిపై గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. అనూహ్యంగా ప్రియాంక సింగ్ పేరు తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యిందనే వార్త లీక్ అయింది.
ప్రియాంక హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. గేమ్ సరిగా ఆడకపోయినా ఎలాగో గట్టెక్కి అయిపోందనిపించేది. తన వ్యక్తిత్వంతో మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న ప్రియాంక.. మానస్‌కి దగ్గరవుతున్నట్లు కొన్ని సందర్భాల్లో అనిపించేది. ఈ విషయంలో ప్రేక్షకులు కూడా ప్రియాంక పట్ల పాజిటివ్‌గా లేరని అర్థమైంది. అయినప్పటికీ ఆమెని 13 వారాలు హౌస్‌లో ఉంచారు. బిగ్ బాస్ 3లో కూడా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చింది. కానీ చాలా త్వరగా హౌస్ నుంచి వెళ్లిపోవలసి వచ్చింది. అయితే ప్రియాంక మాత్రం చివరి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంటెంట్‌గా ఉండి ఇప్పుడు బయటకు వెళ్లడం ఆమె అభిమానులను బాధిస్తుంది.