కింగ్ డమ్ విజయాన్ని టీమ్ మొత్తం ఆస్వాదిస్తోంది. కథలో కొత్తదనం లేకపోయినా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటన, టెక్నికల్ బ్రిలియన్సీ సినిమాను విజయవంతం చేశాయి. గౌతమ్ తిన్ననూరి గత చిత్రాల్లాగా ఎమోషన్స్ పండలేదు కానీ.. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకుంది. అదే సినిమా సక్సెస్ కు కారణం అంటున్నారు. ఇక ఈ మూవీ సక్సెస్ మీట్ లో నాగవంశీ తో పాటు విజయ్ దేవరకొండ కూడా చాలా జోష్ గా కనిపించాడు. ఆ మీట్ లో అనేక విషయాల గురించి పంచుకున్నారు. సెకండ్ పార్ట్ లో మరో పెద్ద హీరో యాడ్ అవుతాడన్నాడు నాగవంశీ. ఇటు విజయ్ కూడా సినిమాలో గుండుతో కనిపించాలనే తన ఐడియానే అని చెప్పడం ఆశ్చర్యం.
ఇక ఈ మూవీ సక్సెస్ మీట్ ను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించాలనుకుంటున్నాం అని చెప్పాడు నాగవంశీ. అందుకోసం రాజమండ్రి, ఏలూరు లో ఏదో ఒకటి డిసైడ్ చేస్తాం అని చెప్పాడు. అయితే ఈ సక్సెస్ మీట్ కు పవన్ కళ్యాణ్ ను పిలుస్తారా అని అడిగితే.. అవసరం లేదమ్మా.. మా పవన్ కళ్యాణ్ ఈయనే అంటూ విజయ్ దేవరకొండను చూపించాడు. అంటే ఇకపై పవన్ కళ్యాణ్ స్థానాన్ని ఇతను భర్తీ చేస్తాడనా లేక ఎప్పట్లానే యధాలాపంగా అనేశాడా అనేది తెలియదు కానీ.. విజయ్ దేవరకొండను పవన్ కళ్యాణ్ తో పోల్చడం మాత్రం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురి చేసింది.