Allu Arjun : అల్లు అర్జున్ కు ఎదురుందా..?

Update: 2024-10-19 04:45 GMT

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 అనేక సంచలనాలు సృష్టిస్తోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే 500 కోట్లు అందుకుంది. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ తెలుగు హీరోగా నిలిచాడు అల్లు అర్జున్. బాహుబలి తర్వాత ప్రభాస్ మూవీస్ కూడా ఆ రేంజ్ ఫిగర్స్ ను సాధించలేదు. ఇక తెలుగు థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. ఒక్క ఏపిలోనే 130 కోట్ల బిజినెస్ అయింది. తెలంగాణలో మైత్రీ వాళ్లు సొంతంగా విడుదల చేసుకుంటున్నారు. ఇక్కడ దాని వాల్యూ ఈజీగా 70 కోట్ల మేర ఉంటుంది. అంటే తెలుగు స్టేట్స్ నుంచి 200 కోట్ల టార్గెట్ గా పుష్ప 2 రాబోతోంది. విశేషం ఏంటంటే.. ఫస్ట్ పార్ట్ తెలుగు స్టేట్స్ లో 100 కోట్లు కూడా సాధించలేదు. అలాంటిది రెండో భాగానికి రెండు వందల కోట్ల బిజినెస్ అవడం అంటే ఖచ్చితంగా ఇది భారీ అంచనాలున్న సినిమానే అని చెప్పాలి.

ఇవి కాక అల్లు అర్జున్ కు కేరళతో పాటు నార్త్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. పుష్ప 1 నార్త్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. అందువల్ల ఈ సారి అక్కడ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. నాన్ థియేట్రికల్ తో కలుపుకుని ఈ చిత్రం 1000 కోట్ల బిజినెస్ చేస్తుందని చాలామంది నమ్ముతున్నారు.ఓ రకంగా ఇది ఐకన్ స్టార్ స్టామినాకూ లిట్మస్ టెస్ట్ లాంటిదే. సుకుమార్ కూడా ఉన్నా.. ఫేస్ అల్లు అర్జున్ దే కాబట్టి.. కచ్చితంగా పుష్ప 2 ఓ పెద్ద పందేరంగానే చెప్పాలి.

ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అల్లు అర్జున కు వ్యతిరేక 'పవనా'లున్నాయి. జనసేనతో పాటు కూటమి మొత్తం ఓ దశలో అతన్ని టార్గెట్ చేసింది. ఈ సినిమాను కూడా అడ్డుకుంటాం అని గతంలో ఏకంగా జనసేన ఎమ్మెల్యేలు ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్బాలున్నాయి. అభిమానులైతే చెప్పేదేముందీ.. అలాంటి స్థితిలో ఇంత పెద్ద బిజినెస్ అవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది.

ఫస్ట్ పార్ట్ కు తెలుగులో విమర్శలు వచ్చాయి. కంటెంట్ పై చాలామంది కామెంట్స్ చేశారు. అలాంటి కామెంట్స్ మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సుకుమార్ పై ఉంది. సినిమాకు ఎక్స్ ట్రార్డినరీ అనే టాక్ వస్తే పుష్పరాజ్ కు ఎదురుండదు. లేకపోయినా మేకర్స్ కు వచ్చే లాసులేం ఉండవు. అదీ మేటర్.

Tags:    

Similar News