Pushpa Trailer: 'పుష్ప' ట్రైలర్ వచ్చేది ఈరోజు కాదట.. మరి ఎప్పుడంటే..
Pushpa Trailer: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది;
Pushpa Trailer (tv5news.in)
Pushpa Trailer: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా నుండి ఇప్పటికీ ట్రైలర్ విడుదల కాకపోయినా.. పాటలు, పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు పెంచేసాడు సుకుమార్. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప ట్రైలర్ ఈరోజు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే మూవీ టీమ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పింది.
టెక్నికల్ సమస్యల వల్ల ట్రైలర్ విడుదల చేయలేకపోతున్నామని చిత్రం నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈరోజు పుష్ప ట్రైలర్ విడుదల కావట్లేదని క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.. ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయంలో మాత్రం ఏ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు సాయంత్రం 6.03కు విడుదల కావాల్సిన ట్రైలర్‌ను రేపు ఉదయం 10.03కు విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే రేపటివరకు వేచి చూడాల్సిందే. అడగకుండానే అప్డేట్స్ ఇచ్చే పుష్ప టీమ్.. ట్రైలర్ విషయంలో ఇలా చేసిందేంటి అంటూ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
Due to unforeseen technical issues, we are unable to release #PushpaTrailer today at 6:03PM. We apologise for the delay. Stay tuned to this space.#PushpaTrailerDay #PushpaTheRise #PushpaTheRiseOnDec17
— Pushpa (@PushpaMovie) December 6, 2021