R. Narayanamurthy ఆర్ నారాయణ మూర్తికి అస్వస్థత.. హాస్పిటల్ లో చేరిక
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తికి అస్వస్థత. నిమ్స్ లో చికిత్స.;
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతో నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. అయితే ఆయనకు ఏమైందీ అన్న విషయం తెలియక అభిమానులంతా గాభరా పడుతున్నారు. మరికొందరైతే సీరియస్ గా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇంకొందరు నిమ్స్ కు వెళ్లి పరామర్శించాలనుకుంటున్నారు. అయితే తనకు తెలియకుండనే జరుగుతున్న ఈ తతంగం గురించి తెలుసుకున్న నారాయణమూర్తి తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తను బానే ఉన్నానని.. దేవుడి దయ వల్ల కోలుకుంటున్నానని.. కోలుకున్న తర్వాత వచ్చి అన్ని వివరాలు తెలియజేస్తానని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.
అయితే అసలు ఆయన ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో జాయిన్ అనే విషయం మాత్రం ఫజిల్ గానే మిగిలింది. కొన్నాళ్లుగా ఆయన షుగర్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. మరి అదే రిపీట్ అయిందా లేక ఇంకేదైనా సీరియస్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన నిమ్స్ లో డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నారు. మొత్తంగా పీపుల్స్ స్టార్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనమూ కోరుకుందాం..