జాతిపిత మహాత్మా గాంధీ జీవిత కథతో వెబ్ సిరీస్ రాబోతుంది. ఇప్పటివరకు ఆయనపై ఎన్నో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మహాత్ముడి కథతో వెబ్ సిరీస్ రాబోతుంది. స్కామ్ 1992, అలీఘర్, షాహిద్, స్కూప్ వంటి సంచలన చిత్రాలు తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో గాంధీ పాత్రలో స్కామ్ 1992 నటుడు ప్రతీక్ గాంధీ నటించబోతున్నాడు. తాజాగా ఈ సిరీస్‌కు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ను మేకర్స్ ప్రకటించారు. అదేంటంటే ఈ సిరీస్ కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సిరీస్ పై ఇప్పటినుండి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. వచ్చే ఏడాది గాంధీ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.