Prabhas Raja Saab : రాజా సాబ్ వచ్చి తీరుతోంది..

Update: 2025-11-04 11:56 GMT

మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ రూపొందుతున్న సినిమా రాజా సాబ్. వరల్డ్ క్లాస్ హారర్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ నుంచి వస్తోన్న హారర్ నేపథ్యంలో వస్తోన్న కంటెంట్ మాత్రం బాగా ఆకట్టుకుంటోందని చెబుతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫీడ్ చూస్తే ఇదే అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని జనవరి 9న వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నాం అని ముందు నుంచీ చెబుతున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ విషయంలో మార్పు జరగబోతోందనే టాక్ వినిపించింది.

రాజా సాబ్ రిలీజ్ డేట్ మారుతోంది అనే టాక్ మాటను కట్టిపడేశారు నిర్మాతలు. తమ సినిమా రిలీజ్ డేట్ కే విడుదల చేయబోతోందని చెప్పారు మేకర్స్. ఇప్పటి వరకు టెక్నికల్ టీమ్ అంతా కష్టపడుతున్నారు అని చెప్పారు. దర్శకుడు కూడా చెప్పిన టైమ్ కు విడదల చేయడానికే 100 శాతం కష్టపడుతున్నారన్నారు.టెక్నికల్ టీమ్ ను హై స్టాండర్డ్స్ ను చూపబోతున్నాం అని మేకర్స్ చెప్పారని చెప్పారు.

 

Tags:    

Similar News