Raja Saab : రాజా సాబ్ అన్ని లెక్కలు సెట్ చేస్తాడు

Update: 2024-08-30 10:45 GMT

పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేసిన విషయం తెలిసిందే. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ప్రమోషన్స్ ఫుల్ గా చేసినా కంటెంట్ లో మ్యాటర్ లేకపోవడంతో.. మినిమం కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఈ సినిమాపై దారుణంగా ట్రోలింగ్‌ కూడా జరిగింది. ఇక ఈ మూవీ తమకు నష్టాలను తెచ్చి పెట్టిందని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ స్వయంగా చెప్పుకొచ్చాడు.

తాజాగా ఇదే విషయం గురించి టీజీ విశ్వప్రసాద్ దగ్గర ప్రస్తావించారు రిపోర్టర్స్. ఆయన నిర్మాతగా వస్తున్న కొత్త చిత్ర శ్వాగ్. టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబోలో వస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఆగస్టు 29న జరిగింది. ఈవెంట్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల మా బ్యానర్ నుండి వచ్చిన సినిమా అంతగా ఆడలేదు. కానీ.. శర్వానంద్ తో చేసిన మనమే సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ప్రభాస్ తో చేస్తున్న రాజా సాబ్‌ అన్ని లెక్కలు తేల్చేస్తాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రాజా సాబ్ ఆడియెన్స్ ముందుకు వస్తుంది.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ తోపాటు మరో హీరోయిన్ గా నటిస్తుంన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ మంచి అంచనాలు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News