Mahesh Babu : మహేష్ బర్త్ డే.. రాజమౌళి స్పెషల్ ట్రీట్ ..

Update: 2025-08-06 10:35 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీపై సీక్రెట్ మెయిన్టేన్ చేస్తూనే ఉన్నాడు రాజమౌళి. సినిమా ప్రారంభానికి చాలా రోజుల ముందే విజయేంద్ర ప్రసాద్ చెప్పిందే అప్డేట్. అంటే ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నాడు. అంతకు మించి ఒక్క ముక్కా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న. ఫీమేల్ లీడ్ లో ప్రియాంక చోప్రా, మరో కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు అనేంత వరకూ బయటకు వచ్చింది. ఆ మధ్య త్వరలోనే టాంజానీయాలో షూటింగ్ కు వెళ్లబోతున్నారు అనే న్యూస్ వచ్చింది. సెప్టెంబర్ లో ఈ షెడ్యూల్ ఉండబోతోంది. అయితే అంతకు ముందే హైదరాబాద్ లో మరో చిన్న షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు రాజమౌళి. ఇదంతా మాగ్జిమం ఇండోర్ లో సాగే ఎపిసోడ్ గా ఉంటుందట. మెయిన్ టీమ్ ఉంటుందా లేదా అనేది చెప్పలేం కానీ.. మహేష్ బాబు పార్ట్ ఉందట.

ఇక ఈ నెల 9న సూపర్ స్టార్ బర్త్ డే ఉంది కదా. ఇది ఆయనకు 50వ పుట్టిన రోజు కావడం విశేషం. అందుకే ఈ బర్త్ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయబోతున్నాడట రాజమౌళి. ఈ షెడ్యూల్ లోనే చిత్రీకరణ జరిగే ప్లేస్ లోనే ఓ భారీ సెట్ వేసి అందులో ఆయన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలనుకుంటున్నారట. అంటే 50వ పుట్టిన రోజు అంటే ఎవరికైనా స్పెషలే కదా. ఏదేమైనా మహేష్ కు అప్పుడే 50యేళ్లు వచ్చాయా అనిపిస్తోంది కదా. ఇప్పటికీ థర్టీస్ లో ఉన్నట్టుగా కనిపిస్తాడు. అలాంటి తను 50వ బర్త్ డే జరుపుకోబోతున్నాడంటే నమ్మలేనట్టుగా ఉంది. అన్నట్టు మహేష్ బర్త్ డే రాజమౌళి స్పెషల్ ట్రీట్ అంటే సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందనుకుంటున్నారేమో అట్టాంటివేం లేవట. జస్ట్ ఈ బర్త్ డే కోసం స్పెషల్ సెట్ వేసి అంతే స్పెషల్ గా కేక్ కట్ చేయించబోతున్నాడట అంతే. సో.. ఫ్యాన్స్ మరీ అంచనాలేం పెట్టుకోవాల్సిన పనిలేదన్నమాట.

Tags:    

Similar News