Rajamouli: 'థాంక్యూ మై హీరో'.. మహేశ్‌పై రాజమౌళి ప్రశంసలు..
Rajamouli: ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా సినిమాలే.;
Rajamouli: ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా సినిమాలే. అందుకే ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాల మధ్య విడుదల తేదీ కోసం గట్టి పోటనే నడుస్తోంది. సాధారణంగా ఏ సినిమా అయినా పండుగ సమయాల్లో విడుదల చేస్తే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని ఆశిస్తారు దర్శక నిర్మాతలు. అందుకే ఈసారి అందరి చూపు సంక్రాంతి బాక్స్‌ఆఫీస్ పైనే ఉంది.
2022 సంక్రాంతి మొత్తం థియేటర్లలో స్టార్ హీరోల సందడి మొదలు కానుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా సైలెంట్ అయిన హీరోలందరూ ఒకేసారి బాక్స్‌ఆఫీస్‌పై దండయాత్ర చేయనున్నారు. అయితే ముందు సంక్రాంతి బరిలో సర్కారు వారి పాట, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ ఉన్నాయి. కానీ ఇందులో నుండి సర్కారు వారి పాట తప్పుకోగా మిగతా మూడు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి.
పాన్ ఇండియా సినిమాలన్నీ ఒకేసారి విడుదలయితే నిర్మాతలు నష్టపోతారని భావించిన దిల్ రాజు.. భీమ్లా నాయక్ నిర్మాతలతో మాట్లాడి ఆ సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేశాడు. ప్రస్తుతం సంక్రాంతి రేసులో మిగిలింది రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ మాత్రమే. అయితే ఈ పరిణామంపై రాజమౌళి ఇటీవల ఓ ట్వీట్ చేశారు. అసలు ఆ ట్వీట్‌కు అర్థమేంటి అని నెటిజన్లు కన్ఫ్యూజన్‌లో పడ్డారు.
భీమ్లా నాయక్ విడుదలను వాయిదా చేయాలన్న నిర్ణయం తీసుకున్నందుకు ఆ సినిమా నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశాడు రాజమౌళి. కానీ దానికంటే ముందే సంక్రాంతి రేస్ నుండి తనంతట తానుగా తప్పుకున్నందుకు మహేశ్ బాబును మెచ్చుకున్నాడు. సర్కారు వారి పాట సంక్రాంతికి విడుదల అయితేనే బాగుంటుంది అని తెలిసినా.. తాను ఈ నిర్ణయం తీసుకున్నందుకు థాంక్యూ మై హీరో అని ట్వీట్ చేశాడు.
.@urstrulyMahesh was the one who took the initative in decluttering the Pongal releases... Even though #SarkaruVaariPaata was a perfect Pongal film, he moved it to summer and created a healthy atmosphere. Thanks to my Hero 🙂 and also to the entire team at @MythriOfficial…
— rajamouli ss (@ssrajamouli) December 21, 2021