Ram Charan: ఆ నాలుగు తెలుగు చిత్రాలు నాకు చాలా ఇష్టం: రామ్ చరణ్

Ram Charan: టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు.

Update: 2023-03-02 06:29 GMT

Ram Charan: టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. ప్రస్తుతం యూఎస్‌లో ఆస్కార్ రన్ సందర్భంగా RRRని ప్రమోట్ చేస్తున్న చరణ్ అక్కడి విలేకరులతో మాట్లాడారు. తనకు ఇష్టమైన జాతీయ, అంతర్జాతీయ చిత్రాల గురించి వెల్లడించారు. నోట్‌బుక్, టెర్మినేటర్ 2 చిత్రాలను బహుశా 50 సార్లు చూసి ఉంటానని చెప్పారు. ఇంకా గ్లాడియేటర్, టరాన్టినో చిత్రాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ నాకు ఇష్టమైన వాటిలో ఒకటి" అని అతను చెప్పాడు.

తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ, "దాన వీర శూర కర్ణ, బాహుబలి చిత్రాలతో పాటు తాను నటించిన రంగస్థలం చిత్రాలు చాలా ఇష్టం. ఇంకా అనేక క్లాసిక్స్ నాకు ఆల్ టైమ్ ఫేవరేట్‌గా ఉన్నాయి. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన మిస్టర్ ఇండియా కూడా నాకు ఇష్టమైన టాప్ చిత్రాలలో ఒకటి అని అన్నారు.

చరణ్ ఇటీవల తనకు జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా-జోన్స్‌లపై యుక్తవయసులో ప్రేమ ఉండేదని వెల్లడించాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ చేయబడింది. గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఈవెంట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రదర్శన ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News