Ram Charan visits Siddhivinayak Temple : సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు
సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన టాలీవుడ్ హీరో రామ్ చరణ్;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శివసేన నాయకుడు రాహుల్ కనాల్‌తో కలిసి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. అక్టోబర్ 3న సాయంత్రం ముంబై విమానాశ్రయంలో రామ్ చరణ్ నలుపు రంగు దుస్తులను ధరించి, చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించాడు. ఆయన దర్శనానంతరం సిద్ధివినాయకుని ఆలయం వెలుపల ఆయనతో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు. గణేశుడికి ప్రార్థనలు చేసి, చెర్రీ తన 41 రోజుల అయ్యప్ప దీక్షను ముగించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పూర్తిగా నలుపు రంగు దుస్తులు ధరించి, తన బృందంతో కలిసి దర్శనానికి వచ్చారు.
రామ్ చరణ్ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు, అభిమానులు ఆయన్ను కలిసేందుకు ఉత్సాహం కనబర్చారు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తన కారు వద్దకు వెళ్లేటప్పుడు భారీగా తరలివచ్చిన ప్రేక్షకుల మధ్య నుంచి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డాడని స్పష్టమైంది. వాహనం వద్దకు సురక్షితంగా చేరుకోవడంలో అతని బృందం అతనికి సహకరించింది.
రామ్ చరణ్ మంగళవారం మధ్యాహ్నం ముంబైలో ల్యాండ్ అయ్యాడు. చెప్పులు లేకుండా కనిపించాడు. తన బృందంతో కలిసి విమానాశ్రయం నుండి నిష్క్రమించడం ఓ వీడియోలోనూ కనిపించింది. అతను చేస్తున్న ప్రార్థనా సమర్పణలలో భాగంగా పూర్తిగా నలుపు రంగు దుస్తులను ధరించాడు. రామ్ చరణ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లి మీడియాను ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించడం కూడా వైరల్ అవుతోన్న కొన్ని వీడియోల్లో కనిపించింది.
#Ramcharan inside at Siddhi Vinayaka temple🛐🙏 #ManOfMassesRamCharan️ #GameChanger pic.twitter.com/rcBaafxEFR
— Adarsh Charan (@theadarsh5) October 4, 2023