Ram Pothineni : రాపో.. మొన్న రాశాడు.. ఇప్పుడు పాడాడు

Update: 2025-09-08 10:42 GMT

రామ్ పోతినేని తనలోని టాలెంట్స్ అన్నీ బయటకు తీస్తున్నాడు. ఇప్పటి వరకూ నటుడుగా ఆకట్టుకున్నాడు. అంతకు మించి టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకడు అనిపించుకున్నాడు. ఫస్ట్ టైమ్ తనలో ఓ రచయిత కూడా ఉన్నాడని ఆంధ్రాకింగ్ తాలూకా సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. పి. మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ మూవీ కోసం ఇంతకు ముందు నువ్వుంటే చాలే అనే పాట రాసి బలే ఆకట్టుుకున్నాడు. రెగ్యులర్ లవ్ సాంగ్ అయినప్పటికీ రామ్ మంచి సాహిత్యంతోనే మెప్పించాడు. చాలామంది రామ్ లోని ఈ సాహితీ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు.

ఫస్ట్ సాంగ్ తో తనలోని సాహిత్య కారుడిని పరిచయం చేసిన రామ్ ఈ సారి సింగర్ అవతారం ఎత్తాడు. తాజాగా తను పాడిన ఆ పాట ప్రోమో విడుదలైంది. అయ్యయ్యో పోయే.. వీడి ఫేసే మాడిపోయే.. అయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే.. అయ్యయ్యో పోయే ఈడి సీటే సిరిగిపోయే.. అంటూ సాగే ఈ గీతాన్ని రామ్ పోతినేని స్వయంగా ఆలపించడం విశేషం. వివేక్ - మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని ఈ పాటను భాస్కరభట్ల రాశాడు. రామ్ పాడాడు. మొత్తంగా ఆంధ్రాకింగ్ తో తనలోని టాలెంట్స్ ను బయటకు చూపిస్తూ.. ఓ కొత్త రామ్ ను చూడబోతున్నారు అనే హింట్స్ ఇస్తున్నారు.

భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఆంధ్రా కింగ్ గా కన్నడ నటుడు ఉపేంద్ర కనిపించబోతున్నాడు. రాహుల్ రామకృష్ణ, సత్య, మురళీ శర్మ, రావు రమేష్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ ఆంధ్రాకింగ్ తాలూకా మూవీ నవంబర్ 28న విడుదల కాబోతోంది. 

Full View

Tags:    

Similar News