ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' ఆగస్ట్ 16న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
మేకర్స్ మాస్ సాంగ్ అఫ్ ది ఇయర్ స్టెప్పా మార్ తో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. మేకర్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్లను అందజేయడం ద్వారా పబ్లిసిటీ దూకుడు పెంచారు. 'డబుల్ ఇస్మార్ట్' అత్యంత అంచనాలున్న పాన్- ఇండియన్ ప్రాజెక్ట్. ఎంతగానో ఎదురుచూస్తున్న ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్. పూరి కనెకట్స్ బ్యానర్ లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించారు. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. మణి శర్మ మ్యూజిక్ అందించారు.