Ram Gopal Varma : ఆ రెండు చిత్రాలపై వర్మ షాకింగ్ కామెంట్స్..

Ram Gopal Varma : సెన్షేషనల్, కాంట్రవర్షియల్ డైరెక్టర్ వర్మ సినీటౌన్‌లో మరో బాంబ్ పేల్చారు;

Update: 2022-09-05 13:55 GMT

Ram Gopal Varma : సెన్షేషనల్, కాంట్రవర్షియల్ డైరెక్టర్ వర్మ సినీటౌన్‌లో మరో బాంబ్ పేల్చారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యులో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కేజీఎఫ్ 2, కశ్మీర్ ఫైల్స్ చిత్రాలు బాలీవుడ్‌ను భయభ్రాంతులకు గురి చేసిందన్నారు.

కొందరు బాలీవుడ్ ప్రముఖులకు కేజీఎఫ్ 2 నచ్చలేదన్నారు. ఓ బడా దర్శకుడు తనకు ఫోన్ చేసి కేజీఎఫ్ 2లోని ఓ సీన్ విషయంపై అతడికి మరో రైటర్‌కు మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు చెప్పినట్లు స్పష్టం చేశారు. అయితే వాళ్లకు సినిమా, సీన్లు ఎలా ఉన్నా బాక్సాఫీస్‌లో భారీ కలెక్షన్లు చేసిన మాట వాస్తవమని రాంగోపాల్ వర్మ అన్నారు. కొన్ని సీన్లకు తానే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.

కశ్మీర్ ఫైల్స్ చిత్రం గురించి మాట్లాడుతూ.. కశ్మీర్ ఫైల్స్‌లో అనుపమ్ ఖేర్ గురించి మాత్రమే కొందరు మాట్లాడుతారు గానీ మూవీ మొత్తం రూ.250 కోట్లు కలెక్ట్ చేసిందని అన్నారు. గత 20 ఏళ్లలో ఏ ప్రేక్షకుడు కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూసినంత సీరియస్‌గా ఏ చిత్రాన్ని చూడలేదన్నారు వర్మ. 

Tags:    

Similar News