నాగశౌర్య హీరోగా 2023లో వచ్చిన సినిమా రంగబలి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన హర్యాన భామ యుక్తి తరేజా. వాస్తవానికి రంగబలి టైమ్ లో అందరూ యుక్తికి తెలుగులో వరుస అవకాశాలొస్తాయనుకున్నారు కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడం, అమ్మడికి లక్ కలిసి రాకపోవడం వల్ల రంగబలి తర్వాత యుక్తి టాలీవుడ్ లో కనిపించలేదు. ఈ గ్యాప్ లో మాల యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు చేసిన సినిమా మార్కో సినిమా రీసెంట్ గా రిలీజై మంచి హిట్ అందుకుంది. ఈ క్రమంలో యుక్తిని టాలీవుడ్ రా రమ్మని పిలుస్తోంది. తెలుగులో మరో అవకాశం దక్కింది. ఈ అమ్మడిని కిరణ్ అబ్బవరం సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రాజేష్ దండాని ర్మించనున్న కె ర్యాంప్ సినిమా కోసం యుక్తిని తీసుకున్నట్లు సమాచారం. కె ర్యాంప్ కథ బాగా వచ్చిందని ఆల్రెడీ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే యుక్తికి తెలుగు నుంచి అవకాశాలు క్యూ కట్టే ఛాన్సుంది.