Rashi Khanna: సౌత్ ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రాశి ఖన్నా..
Rashi Khanna: సౌత్‌లో హీరోయిన్లకు అభిమానులు ట్యాగ్స్ ఇస్తారని అవి తనకు నచ్చవన్న విషయాన్ని బయటపెట్టింది రాశి ఖన్నా.;
Rashi Khanna (tv5news.in)
Rashi Khanna: 2013లో 'మద్రాస్ కేఫ్' అనే బాలీవుడ్ సినిమాతో నటిగా పరిచయమయ్యింది రాశి ఖన్నా. ఆ తర్వాత వెంటనే తెలుగులో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. నాగశౌర్య సరసన రాశి డెబ్యూ ఇచ్చిన 'ఊహలు గుసగుసలాడే' సూపర్ హిట్ అవ్వడంతో తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలాకాలం తర్వాత మళ్లీ హిందీలో బిజీ అయిన రాశి.. సౌత్ ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
ఎన్నో సినిమాలతో సౌత్ సినిమాలను ఆకట్టుకున్న రాశి ఖన్నా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. ఇప్పటికే అజయ్ దేవగన్ హీరోగా నటించిన 'రుద్ర' వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటించింది రాశి. ఇది మాత్రమే కాకుండా సిద్ధార్థ్ మల్హోత్రా, షాహిద్ కపూర్‌తో కూడా జతకట్టనుంది రాశి. తను నటించిన రుద్ర సిరీస్ ఓటీటీలో విడుదల కావడంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడింది రాశి.
రోటీన్‌గా ఉండిపోవడం తనకు నచ్చింది అని తెలిపింది రాశి. తను తెలుగులో పలు కమర్షియల్ సినిమాల్లో నటించినా కూడా ఆ రొటీన్ ఫార్ములాతోనే ఉండిపోలేదు అని చెప్పింది. అయితే సౌత్‌లో తనకు క్రియేట్ చేసిన రొటీన్ ఫార్ములాలు అన్నింటినీ దాటుకుంటూ వచ్చానని రాశి తెలిపింది. ఇప్పటినుండి తాను చేసే ప్రతీ సినిమాలో ఒక కొత్త రాశిని చూడబోతున్నారు అని అభిమానులకు హామి ఇచ్చింది.
సౌత్‌లో హీరోయిన్లకు అభిమానులు ట్యాగ్స్ ఇస్తారని అవి తనకు నచ్చవన్న విషయాన్ని బయటపెట్టింది రాశి ఖన్నా. మామూలుగా హీరోయిన్లను మిల్కీ బ్యూటీ అంటూ పిలవడం సౌత్ ప్రేక్షకులకు అలవాటని, కానీ హీరోయిన్లంటే అంతకు మించి టాలెంట్ ఉంటుంది అని తెలిపింది. ప్రస్తుతం రాశి ఖన్నా చేసిన ఈ కామెంట్స్ సెన్సేషన్‌గా మారాయి.