Rashmi Gautam: పైకి వచ్చిందంటే చాలామందితో గడిపింది అనుకుంటారు: రష్మి
Rashmi Gautam: సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే రష్మికి.. జబర్దస్త్‌లాంటి ఆఫర్ వచ్చింది.;
Rashmi Gautam (tv5news.in)
Rashmi Gautam: ప్రస్తుతం తెలుగుతెరపై కొందరే యాంకర్స్ హవా నడుస్తోంది. అందులో ఒకరు యాంకర్ రష్మి. నటిగా తన కెరీర్‌ను ప్రారంభించినా కూడా యాంకర్‌గానే తనకు లక్ కలిసొచ్చింది. తెలుగుతెరపై తాను ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో అంతగా నెగిటివిటీని కూడా ఎదుర్కుంటోంది. తాజాగా రష్మి పెట్టిన ఓ పోస్ట్ ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది.
సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే రష్మికి.. జబర్దస్త్‌లాంటి ఆఫర్ వచ్చింది. ఆ షో వల్ల అనసూయకు ఎంత పాపులారిటీ వచ్చిందో.. తర్వాత వచ్చిన రష్మి కూడా అంతే గుర్తింపును సంపాదించుకుంది. అయితే మొదటి నుండే రష్మి డ్రెస్సింగ్ గురించి రకరకాల నెగిటివ్ కామెంట్స్ వినిపించేవి. కానీ అవేవి రష్మి పెద్దగా పట్టించుకోలేదు.
రష్మి ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా.. ఎక్కువశాతం సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులనే పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా 'పైకి రావాలంటే చాలామందితో గడిపి ఉంటుంది - చాలామంది ఈజీగా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తారు' అంటూ ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది రష్మి. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్ అవుతోంది.