Rashmika-Vijay Devarakonda : సంథింగ్.. సంథింగ్.. వైరల్‌గా మారిన ఫోటోలు..!
Rashmika-Vijay Devarakonda : అయితే రష్మిక, ఆనంద్ షేర్ చేసిన రెండు ఫోటోల్లోని లొకేషన్లు ఒకటే కావడంతో విజయ్, రష్మిక రిలేషన్ లోనే ఉన్నారంటూ మళ్ళీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.;
Rashmika-Vijay Devarakonda: టాలీవుడ్‌లో లవ్లీ పెయిర్ అనిపించుకున్నారు హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న.. మొదటిసారిగా వీరిద్దరూ కలిసి గీతగోవిందం చిత్రంలో నటించారు. ఆ సమయంలో వీరిద్దరి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అదే టైంలో కన్నడ నటుడు రోహిత్ శెట్టితో నిశ్చితార్థాన్ని రష్మిక క్యాన్సిల్ చేసుకోవడంతో ఆ వార్తలకి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. విజయ్‌తో ప్రేమలో ఉండడం వల్లే రష్మిక.. రోహిత్‌కు బ్రేకప్ చెప్పిందన్న గుసగుసలు వినిపించాయి.
కానీ ఆ వార్తలను వారిద్దరూ కొట్టిపారేశారు. ఇదిలావుండగా తాజాగా వీరిద్దరూ రిలేషన్‌లోనే ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా దేవరకొండ సోదరులిద్దరూ గోవాకు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అటు రష్మిక కూడా 'హ్యాపీ న్యూ ఇయర్ మై లవ్స్' అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
అయితే రష్మిక, ఆనంద్ షేర్ చేసిన రెండు ఫోటోల్లోని లొకేషన్లు ఒకటే కావడంతో విజయ్, రష్మిక రిలేషన్ లోనే ఉన్నారంటూ మళ్ళీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా ముంబయిలో ఉన్న ఈ జంట క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా డిన్నర్ డేట్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.