Rashmika Mandanna : రష్మిక ఆస్తులు రూ. 66 కోట్లు

Update: 2025-03-26 09:45 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆస్తుల విలువ అక్షరాల 66 కోట్లు అని ఫోర్బ్స్ మ్యాగజైన్ కథనం ప్రచురించింది. 28 ఏళ్ల వయస్సున్న ఈ అమ్మడు నటించిన పుష్ప -2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం, ఈ సినిమాకు 3,300 కోట్ల కలెక్షన్ రావడం గమనార్హం.పుష్ప - 2 సినిమాలో నటించిన ఆమె ఇందుకోసం రూ. 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు రష్మిక అక్ష రాలా నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటీమ ణుల్లో ఒకరైన రష్మిక 2016లో కిరిక్ పార్టీ సినిమాతో అరంగేట్రం చేసింది. 2017లో అంజనీ పుత్ర, చమక్, 2018లో గీత గోవిందం సినిమాలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత యానిమల్ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చు కుంది. ఆమెకు బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన ఒక బంగ్లా, ముంబై, గోవా, కూర్గ్ మరియు హైద రాబాద్ లో స్థిరాస్తులు ఉన్నట్లు సమాచారం. రష్మికకు ఆడి క్యూ 3 తోపాటు రేంజ్ రోవర్ స్పోర్ట్ అమాంగ్ తదితర కార్లు ఉన్నట్టు తెలిపింది. బాలీవుడ్ హీరోయిన్లను వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోతోందీ కన్నడ భామ

Tags:    

Similar News