Rashmika Mandanna : మూడోసారి డీప్ ఫేక్ బారిన పడిన రష్మిక

Update: 2024-08-20 15:15 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పటికే రెండు సార్లు డీప్ ఫేక్ బారిన పడింది. వాటిని క్రియేట్ చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా మూడో సారి డీప్ ఫేక్ బారిన పడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విచ్చలవిడిగా వినియోగించు కుంటూ.. చేయని పనులు కూడా చేసినట్టు మార్చి క్రియోట్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన చాలా మంది జీవితాలు నాశనమవుతున్నాయి. ఇప్పుడు వైరలవుతున్న ఈ వీడియోలో నలుపు రంగు బికినీ వేసుకున్న అమ్మాయికి రష్మిక ముఖాన్ని తగిలించారు. ప్రీతి రాజ్పుత్ అనే పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఐడీ నుంచి దీన్ని అప్ లోడ్ చేశారు. ఈ వీడియో చూసినవారంతా రష్మిక ఏమిటి.. ఇలాంటి వీడియో విడుదల చేసిందని అనుకున్నారు. అయితే అది డీప్ ఫేక్ అని తెలియడంతో ఆమె అభిమానులు మండిపడుతున్నారు. దీనిని క్రియేట్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News