Rashmika Mandanna : తన డేటింగ్ పై ఆసక్తికరమైన విషయాలు చెప్పిన రష్మిక మందన
Rashmika Mandanna : రష్మిక మందన, విజయ దేవరకొండ ఇద్దరూ ఎంతో కాలం నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు అనేక గాసిప్స్ వెలువడ్డాయి;
Rashmika Mandanna : రష్మిక మందన, విజయ దేవరకొండ ఇద్దరూ ఎంతో కాలం నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు అనేక గాసిప్స్ వెలువడ్డాయి. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో రష్మికపై మీ అభిప్రాయం ఏంటని విజయదేవరకొండను ప్రశ్నించగా 'డార్లింగ్' అని సమాధానమిచ్చాడు. గీతాగోవిందం మూవీ సినిమా నుంచి ఈ గాసిప్స్ పేలుతూనే ఉన్నాయి. దీనిపై రష్మిక ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది. విజయదేవరకొండ నేను డేటింగ్‌లో ఉన్నట్లు చాలా వార్తలు వస్తున్నాయి. నేను చెప్పేంత వరకూ వాటిని నమ్మవద్దని క్లారిటీ ఇచ్చింది.
అమితాబ్ బచ్చన్ హీరోగా గుడ్‌బై అనే మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెడుతుంది రష్మిక. సిద్ధార్థ్ మల్హోత్రాతో 'మిజన్ మజ్ను' అనే స్పైథ్రిల్లర్‌లో కూడా నటిస్తోంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌కు జోడీగా యానిమల్ చిత్రంలో నటిస్తోంది. అటు టాలీవుడ్, కాలీవుడ్‌లోనూ ఎన్నో ఆఫర్లతో బిజీగా గడిపేస్తోంది ఈ నేషనల్ క్రష్.