Rashmika Mandanna: అందులో ఫస్ట్ ప్లేస్‌లో రష్మిక.. స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి..
Rashmika Mandanna: పరభాషల నుండి వచ్చినా కొందరు హీరోయిన్లు టాలీవుడ్‌లో గోల్డోన్ లెగ్‌గా స్థిరపడిపోయారు.;
Rashmika Mandanna (tv5news.in)
Rashmika Mandanna: పరభాషల నుండి వచ్చినా కొందరు హీరోయిన్లు టాలీవుడ్‌లో గోల్డోన్ లెగ్‌గా స్థిరపడిపోయారు. అందులో ఒకరే రష్మిక మందనా. తెలుగులో తన మొదటి సినిమా విడుదలవ్వక ముందే అచ్చమైనా తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ భామ.. ఇతర హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతోంది. అవకాశాలు అందుకోవడంలోనే కాదు.. సోషల్ మీడియా పాపులారిటీలో కూడా ఈ భామది ఫస్ట్ ప్లేస్.
రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూ.. ఎక్కువగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఫాలోవర్స్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్‌కు హద్దే లేదు. తాజాగా ఈ ఫాలోయింగ్‌తోనే అమ్మడు మరో రికార్డును సొంతం చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ హీరోయిన్‌కు లేనంతమంది ఫాలోవర్స్ రష్మికకు ఉన్నారు. ఆ కౌంట్ రోజురోజుకీ పెరుగుతోంది కూడా. తాజాగా సినీ తారల సోషల్ మీడియా పాపులారిటీ ఆధారంగా ఫోర్బ్స్ ఓ లిస్ట్‌ను తయారు చేసింది. ఇందులో రష్మిక 9.88 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, విజయ్ దేవరకొండ (9.67) రెండోస్థానంలో ఉన్నాడు. కన్నడ స్టార్ యశ్ (9.54) మూడో స్థానంలో, సమంత (9.49) నాలుగో స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ (9.46) కు ఐదో స్థానం, ప్రభాస్ (9.40) కు ఎనిమిదో స్థానం లభించాయి.