నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాను నటించిన పుష్ప -2 సినిమాను విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి వీక్షించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ తల్లి మాధవీ దేవరకొండ, సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. హైదరాబాద్ లోని ఏఎంబీ థియేటర్ లో తాను సినిమా వీక్షించినట్టు ఆమె తెలిపారు. విజయ్ దేవరకొండకు చెందిన రౌడీ బ్రాండ్ స్వెట్ వేర్ లో రష్మిక కనిపించారు. విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ లో ఉన్నారనే 1 ఊహాగానాలకు ఈ ఫొటో మరింత ఊతమిచ్చిందనే చెప్పాలి. దీనిపై వీళ్లిద్దరి నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.