Rashmika Mandanna : ఆదివాసీ సంప్రదాయంతో రష్మిక సినిమా ఓపెనింగ్

Update: 2025-07-29 08:35 GMT

రష్మిక మందన్నా మెయిన్ లీడ్ లో నటించబోతోన్న సినిమా ‘మైసా’. ఆ మధ్య విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. చాలా రగ్ డ్ లుక్ తో కనిపిస్తోంది తను. ఈ తరహా పాత్రలో రష్మికను చూడలేదు. పైగా లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి అందరి అటెన్షన్ వచ్చిందా పోస్టర్ కు. ప్రస్తుతం తను సూపర్ ఫామ్ లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ టైమ్ లో లేడీ ఓరియంటెడ్ మూవీ అనేది పర్ఫెక్ట్ ఛాయిస్ అనుకోవచ్చు. ఇక తాజాగా ఈ మూవీ ఓపెనింగ్ జరిగింది. మామూలుగా సినిమా ఓపెనింగ్స్ కొందరు గెస్ట్ లు, పూజా కార్యక్రమాలతో కనిపిస్తాయి. వాటితో పాటు ఈ మూవీకి కొందరు ఆదివాసీ గిరిజనులను కూడా రప్పించారు. వారి సంప్రదాయ సంగీత పరికరాలతో పాటు నృత్యాలతో ఆకట్టుకున్నారు. సో.. సింబాలిక్ గా చూస్తే ఈ మూవీలో రష్మిక కూడా ఓ గిరిజన యువతిగా కనిపించబోతోందేమో అనుకోవచ్చు.

మైసా కంటే ముందు తను ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీతో రాబోతోంది. మరోవైపు హిందీలో థామా అనే సినిమా కూడా లైన్ లో ఉంది. అయితే మైసా కోసం మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదేమో అనే డౌట్ కూడా వస్తుంది. అంటే తను ఈ ప్రాజెక్ట్ ను అంత బలంగా నమ్ముతుందీ అనుకోవచ్చు. ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అనిల్, అజయ్ నిర్మిస్తున్నారు. అలాగే మిగతా కాస్టింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా రావాల్సి ఉంది.

మరి నయనతార తర్వాత ఈ జెనరేషన్ లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో అంత హైలెట్ కాలేదెవరూ. మరి రష్మిక అవుతుందా అనేది చూడాలి. 

Full View

Tags:    

Similar News