ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ లో ఒకరైన రష్మిక మందన్నా ( Rashmika Mandanna ) చేస్తున్న సెన్సేషన్ మామూలుగా ఉండటం లేదు. సౌత్.. నార్త్ కలిపి పుల్ క్రేజ్ లో దూసుకుపోతోంది. తాజాగా రష్మిక మందన్నా.. మగాళ్ళపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.
యానిమల్ సినిమాలోని ఒక బోల్డ్ సీన్ కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి రష్మికను ట్యాగ్ చేశారు ఓ అభిమాని. అబ్బాయిలు చీట్ చేసే వాళ్ళు అనేట్టుగా ట్వీట్ పెట్టారు. దీనిపై రష్మిక మందన్నా ఆమెకు రిప్లై ఇచ్చింది. స్మాల్ చేంజ్ .. అబ్బాయిలలో భయంకరమైన వాళ్లే కాదు.. మంచి మనుషులు కూడా ఉంటారు అంటూ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది రష్మిక.
రష్మిక మందన్నా చేసిన రిప్లై పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అబ్బాయిలకు పాజిటివ్ గా రష్మిక మెసేజ్ ఉండటంతో బాయ్స్ సపోర్ట్ చేస్తున్నారు.