Ravi Teja : సంచలనం సృష్టించబోతోన్న రవితేజ

Update: 2025-06-05 12:50 GMT

మాస్ మహారాజ్ రవితేజ ఓ కొత్త సంచలనం సృష్టించబోతున్నాడు. అతని రేంజ్ హీరోలెవరూ ఇప్పటి వరకూ చేయని సెన్సేషన్ ఇది. ప్లానింగ్ పక్కాగా అమలైతే మాత్రం ఇదో రికార్డ్ కూడా అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేసి ఉన్నా.. వాళ్లెవరూ చెప్పలేదు కాబట్టి మాస్ రాజానే ఆ రికార్డ్ సాధించినట్టు అవుతుంది. ఇంతకీ ఆ సంచలనం ఏంటీ అంటే.. తన నెక్ట్స్ మూవీ షూటింగ్ డేస్. ప్రస్తుతం మాస్ జాతర అనే మూవీ చేస్తున్నాడు రవితేజ. అతనికి ఇది 75వ సినిమా. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ధమాకా తర్వాత శ్రీ లీల మరోసారి మాస్ రాజాతో రొమాన్స్ చేయబోతోంది ఈ మూవీతో. మే నెలలో విడుదల కావాల్సిన మాస్ జాతరను చాలా దూరం పోస్ట్ పోన్ చేస్తూ.. ఆగస్ట్ 27న రిలీజ్ చేయబోతున్నారు.

మాస్ జాతర తర్వాత రవితేజ దర్శకుడు కిశోర్ తిరుమలతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ గతంలోనే వచ్చింది. ముగ్గురు హీరోయిన్లు అనే టాక్ కూడా ఉంది. అయితే తాజాగా ఓ హీరోయిన్ గా అషికా రంగనాథ్ ను తీసుకోబోతున్నారు అనే టాక్ వస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించిందే ఈ సెన్సేషన్. ఈ చిత్రాన్ని ఈ నెల 16 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నారు. ఇందులో విశేషం ఏం లేదు కానీ.. సినిమా మొత్తం టాకీ పార్ట్ ను ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయబోతున్నారు. యస్.. ఈ నెల 16న మొదలయ్యే షూటింగ్ జూలై 24 వరకూ ఏ మాత్రం పెండింగ్ లేకుండా ఏకధాటిగా చిత్రీకరించబోతున్నారు. అంటే 40 రోజుల్లోనే ఒకే షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయబోతున్నారు. అంటే ఓ స్టార్ హీరో మూవీకి సంబంధించి ఇదోరికార్డ్ అనే చెప్పాలి. కాకపోతే వర్కింగ్ డేస్ ఇంకాస్త ఎక్కువగా ఉండొచ్చు. అది కూడా కేవలం పాటల కోసం. అవీ సరిగ్లా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ టైమ్ లోనే పూర్తిపోతాయి.

ఇక ఈ మూవీతో రవితేజ సంక్రాంతి బరిలో నిలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. గతేడాది ఈగల్ మూవీతో సంక్రాంతికి ట్రై చేశాడు. వర్కవుట్ కాలేదు. ఈ యేడాది మాస్ జాతరను సంక్రాంతికి తేవాలనుకున్నాడు. యాక్సిడెంట్ కారణంగా కుదరలేదు. సో.. 2026లో అయినా సంక్రాంతికి వస్తాడా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News