మెగాస్టార్ చిరంజీవి మెగ్నానిమస్ బ్లాక్ బస్టర్స్ లో ఇంద్ర ఒకటి. 2002 జూలై 24న విడుదలైన ఇంద్ర అప్పటికి ఉన్న అన్ని రికార్డులు బద్ధలు కొట్టింది. కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ లా కనిపించే ఈ మూవీ మెగాస్టార్ చేసిన ఫస్ట్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కథ. అప్పట్లో ఫ్యాక్షన్ కథలకు ఫేమస్ గా మారిన చిన్నికృష్ణ అందించిన కథ ఇది. కాశీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా ఉంటే సీమ నేపథ్యంలో వచ్చిన మిగతా పార్ట్ అంతా యాక్షన్ తో నిండి అదిరిపోతుంది. గవర్నర్ గా ప్రకాష్ రాజ్, షౌకత్ అలీఖాన్ గా నటించిన పునీత్ ఇస్సార్ తో పాటు ముఖేష్ రుషి, మధ్య వచ్చే అన్ని సీన్లూ హైలెట్ గా ఉంటాయి. ఈ సందర్భాల్లో వచ్చే మణిశర్మ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే గ్లామర్ తో పాటు నటన కూడా హైలెట్ గా ఉంటే.. ఫస్ట్ హాఫ్ కాశీలో వచ్చే బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ నారాయణ కామెడీ అల్టిమేట్ గా కనిపిస్తుంది. సో.. ఎలా చూసినా ఓ మంచి కమర్షియల్ సినిమా చూసిన అనుభూతిని హండ్రెడ్ పర్సెంట్ కలిగిస్తుందీ మూవీ.
ఇంద్ర మూవీకి బెస్ట్ యాక్టర్ గా చిరంజీవికి నంది తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అలాంటి మూవీని ఆయన బర్త్ డే స్పెషల్ గా ఈ నెల 22న రీ రిలీజ్ చేస్తున్నారంటే దానికి స్పందన మామూలుగా ఉంటుందా. యస్.. బట్ ఊహించినదానికంటే డబుల్ గా ఉండటమే మెగా స్టామినాకు నిదర్శనం. ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ డే ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. ఆ రేంజ్ లో సేల్స్ ఉన్నాయి. మరి రిలీజ్ తర్వాత కలెక్షన్స్ పరంగానూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.