Renjusha Menon : అపార్ట్మెంట్లో ఉరి వేసుకున్న ప్రముఖ నటి
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న రెంజూషా మీనన్;
మలయాళ చలనచిత్ర, టీవీ పరిశ్రమలో ప్రసిద్ధ నటి అయిన రెంజూషా మీనన్ తిరువనంతపురంలోని తన అద్దె అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె తన కుటుంబంతో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తోంది. కాగా ప్రస్తుతం ఆమె వయసు 35.
మృతిపై శ్రీకరియం పోలీసుల విచారణ..
ఆమె గది చాలా సమయం పాటు తాళం వేసి ఉందని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఆందోళన చెందిన వారు బలవంతంగా ఆమె రూమ్ తలుపులు తెరిచారు. అప్పటికే ఆమె విగత జీవిగా కనిపించడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనంతరం ఆమె విషాద మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ఆమె మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.
రెంజూషా మీనన్ ప్రఖ్యాత నటి. ఆమె వివిధ టీవీ ఛానెల్‌లలో అనేక టెలివిజన్ సీరియల్స్‌లో కనిపించింది. అంతే కాదు ఆమె కొన్ని మలయాళ చిత్రాలలో కూడా కనిపించింది.