Yamini Krishnamurthy : ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

Update: 2024-08-03 14:25 GMT

ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఆమె బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 1940లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆమె జన్మించారు. యామినీని కేంద్రం 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు

Tags:    

Similar News