రియా కేసు రకుల్ నెత్తిమీదకొచ్చింది..
బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ లింకుల వ్యవహారం... క్రమంగా టాలీవుడ్‌కూ విస్తరిస్తోంది. సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి NCB విచారణలో వెల్లడించిన..;
బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ లింకుల వ్యవహారం... క్రమంగా టాలీవుడ్‌కూ విస్తరిస్తోంది. సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి NCB విచారణలో వెల్లడించిన అంశాలు.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. డ్రగ్స్ తీసుకునే 25 మంది పేర్లను రియా వెల్లడించగా.. అందులో టాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన స్నేహితురాలు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లను కూడా రియా వెల్లడించడం సంచలనంగా మారింది. రకుల్‌తో పాటు ఇంకా కొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
గతంలోనూ చాలాసార్లు డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకి వచ్చాయి. 2017 లో డ్రగ్స్ కేసులో 15 మంది టాలీవుడ్ ప్రముఖులతో లింక్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిట్ అధికారులు... పూరీ జగన్నాథ్, రవి తేజ, ఛార్మి, తరుణ్, నవదీప్, ముమైత్ ఖాన్, సుబ్బరాజు,తనీష్ లతో పాటు మరికొందరిని విచారించారు. అందరి రక్తం, వెంట్రుకల నమూనాలు తీసుకుని వాటిని పరీక్షలకు పంపారు. అనుమానితుల్లో చాలా మంది డ్రగ్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఛార్జ్ షీట్ లో కూడా సిట్ ఈ విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఆ తర్వాత ఆ కేసు క్రమంగా మందగమనంలోకి వెళ్లిపోయింది. ఇప్పటికీ టాలీవుడ్ లో చాలా మంది డ్రగ్స్ వాడుతున్నారని చర్చ జోరుగా సాగుతూనే ఉంది. పలువురు ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నట్లు ఇప్పటికే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అనేకసార్లు రుజువు కూడా చేశారు.