Smart Tv's : పెరగనున్న స్మార్ట్ టీవీల ధరలు

Update: 2024-03-30 07:38 GMT

స్మార్ట్ టీవీల ధరలు ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్స్ ఐవోటీ సర్వీస్ వెల్లడించింది. అయితే ప్రీమియం మోడల్స్‌కు దేశంలో డిమాండ్ ఉండడంతో స్మార్ట్‌టీవీ దిగుమతులు 9శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయని, ముఖ్యంగా అతిపెద్ద స్క్రీన్‌ టీవీలకు అప్‌గ్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లో టీవీల విక్రయాలు దూసుకుపోతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో గతేడాది టీవీల దిగుమతులు 16 శాతం మేర తగ్గిన విషయం తెలిసిందే.

దేశీయంగా వినియోగిస్తున్న టీవీల్లో స్మార్ట్‌ టీవీల వాటా 93 శాతంగా ఉన్నది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని తన నివేదికలో వెల్లడించింది.

Tags:    

Similar News